తాజా వార్తలు

Saturday, 22 April 2017

జైలుకైనా… ఉరిశిక్షకైనా సిద్ధమే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌ విసిరారు… ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసేవారిపై కేసులు పెట్టాలంటూ ప్రకటించిన కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ కోమటిరెడ్డి… అన్ని శాఖల్లోనూ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఓ స్కామ్‌ అని పేర్కొన్న కోమటిరెడ్డి… అమృత్ పథకంలోనూ అవినీతి జరిగిందన్నారు.ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి… నా ఆరోపణలు తప్పని తేలితే నా పై కేసు పెట్టండి… జైలుకు వెళ్లడానికైనా… ఉరిశిక్షకైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
« PREV
NEXT »

No comments

Post a Comment