తాజా వార్తలు

Saturday, 22 April 2017

భార్యను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్‌ఐ

పోలీసులే పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ఘటన కర్నూలులో జరిగింది. చిత్తూరు జిల్లాలో శివకుమార్ ఎస్‌ఐగా చేస్తున్నారు. అతని భార్య నగీనా అనంతపురం జిల్లా గుడిబండలో కానిస్టేబుల్‌గా చేస్తోంది. నిన్న రాత్రి నగీనా… మరో కానిస్టేబుల్‌తో కలిసి ఓ లాడ్జ్‌లో ఉండగా.. పోలీసులతో వచ్చిన శివకుమార్… రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. చివరకు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.

గతంలో శివకుమార్ అనంతపురం జిల్లాలో పని చేసిన సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో… పోలీసుల సహాయంతో శివకుమార్, నగీనా పెళ్లి చేసుకున్నారు. అయితే.. కొంత కాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో… వేరు వేరుగా ఉంటున్నారు. ఇటీవలే నగీనా ఎస్‌ఐగా సెలక్ట్ అయింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కర్నూలుకు వచ్చింది. గతంలో తనతో పాటు పని చేసిన అబ్ధుల్ గఫార్ అనే కానిస్టేబుల్‌తో కలిసి ఓ లాడ్జ్‌లో దిగింది. విషయం తెలిసిన శివకుమార్… పోలీసులను తీసుకు వచ్చి లాడ్జ్‌పై రైడ్ చేయించాడు. భార్యను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టించాడు. పోలీస్ రైడ్ జరుగుతున్న సమయంలో శివకుమార్, అతని భార్య, గఫార్ పరస్పరం దాడులకు పాల్పడ్డారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment