తాజా వార్తలు

Wednesday, 12 April 2017

ఫ్రిడ్జ్‌లో కొండచిలువ

పెరుగు కొనుక్కుందామని ఓ మహిళ సూపర్‌మార్కెట్‌కి వెళ్లింది. అక్కడి ఫ్రిడ్జ్‌లో పెరుగు తీసుకుందామని ఫ్రిడ్జ్‌ తెరిచింది. అంతే అందులో హాయిగా నిద్రిస్తున్న 12 అడుగుల కొండచిలువను చూసి హడలిపోయింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆమె కేకలు వేయడంతో మార్కెట్‌ సిబ్బంది పరుగులు తీసి.. ఫ్రిడ్జ్‌ వద్ద గుమిగూడారు. పాములు పట్టే వారిని పిలిపించి లోపలున్న కొండచిలువను బయటకు లాగారు. దాన్ని జాతీయ పార్కులో సురక్షితంగా వదిలారు. అయితే కొండచిలువ చల్లగా ఉన్న ఫ్రిడ్జ్‌లో మత్తుగా నిద్రపోతోతుండటం వల్ల మహిళకు ప్రమాదం తప్పింది. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. ఇది ఆఫ్రికన్‌ రాక్‌ కొండచిలువని, చాలా ప్రమాదకరమని పాము పట్టడానికి వచ్చిన వారు పేర్కొన్నారు. మనుషుల్ని వూపిరి ఆగకుండా చుట్టేసి చంపేస్తాయన్నారు.
తమ సూపర్‌మార్కెట్‌ వెనుక చాలా పొదలు ఉన్నాయని, పైకప్పు నుంచో, లేక కింది కాలువ నుంచో కొండచిలువ వచ్చి ఫ్రిడ్జ్‌లో చేరుంటుందని యాజమాన్యం పేర్కొంది.
« PREV
NEXT »

No comments

Post a Comment