తాజా వార్తలు

Friday, 7 April 2017

రాష్ట్రపతి పదవిపై క్లారిటీ ఇచ్చిన అద్వానీ

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ ఓ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రపతి పదవిపై ఆయన స్పందించారు. రాష్ట్రపతి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రణబ్ ముఖర్జీకి మరి కొద్ది రోజుల్లో రాష్ట్రపతిగా పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక కోసం కసరత్తులు మొదలయ్యాయి. బీజేపీ నుంచి రాష్ట్రపతి రేసులో అద్వానీ ఉన్నారని, మోడీ కూడా అద్వానీకి స్థానం కల్పించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు  వార్తలొచ్చాయి. కానీ అద్వానీ ప్రకటనతో ఈ పుకార్లకు పుల్ స్టాప్ పడింది. తాను రాష్ట్రపతి రేసులో ఉండడంలేదని ప్రకటించారు అద్వానీ. తర్వాత ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరు ఉంటారనే దానిపై ఇప్పుడు చర్చనియాంశంగా మారిపోయింది. మరోవైపు అద్వానీకి బాబ్రీ మసీద్ కేసు వెంటాడుతోంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా తాను రేసులో లేనని ఇంతకు ముందే స్పష్టం చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment