తాజా వార్తలు

Friday, 7 April 2017

నాకు నీచమైన భాష వచ్చు..

మంత్రులు అయ్యన్న పాత్రుడు, నారా లోకేశ్ లను ‘ఎర్రిపప్పు, ముద్దపప్పు’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఈ వ్యాఖ్యలపై రోజాకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘ఎర్రి పప్పు, ముద్ద పప్పు కన్నా నీచమైన భాష మాట్లాడగలను. రోజాకు ఆలోచించే శక్తి లేదు. అసలు, ఆమెకు బుర్ర లేదు’ అంటూ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రాజ్యాంగం, రాజకీయం గురించి రోజా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. రోజా ఇప్పటికైనా బుద్దితెచ్చుకోవాలని చెప్పిన అయ్యన్న, ఆమె గురించి ఎక్కువ మాట్లాడటం కూడా మంచిది కాదని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment