తాజా వార్తలు

Thursday, 13 April 2017

నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించిన మినిస్టర్ కేటీఆర్

నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగులు మృత్యువాతపడగా..ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి మంత్రికేటీఆర్ ఆస్పత్రికి తరలించారు.

గురువారం  రాత్రి లాలాపేటకు చెందిన ఎండీ అజార్ అతని కుటుంబసభ్యులు ఒకే స్కూటీపై  తిరుమలగిరి ఆర్ టీఏ కార్యాలయం వద్ద మలుపుతిరుగుతున్న సమయంలో వారికి ఎదురుగా వస్తున్న జీహెచ్ఎంసీ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆజర్‌(37), అమన్‌(9), అశ్వియా(7), అలీనా(3) అక్కడికక్కడే మృతి చెందగా.. అజహర్ భార్య ఇమ్రాన్‌బేగం, మరో చిన్నారి అదియా తీవ్రంగా గాయపడ్డారు.

అదే సమయంలో సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వస్తున్న మంత్రి కేటీఆర్ క్షతగాత్రుల్ని తన కాన్వాయ్ లో ఓ వాహనంలో యశోదా ఆస్పత్రికి తరలించారు.

అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితుడు పరారయ్యాడు.  కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు. తాగినడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment