Writen by
vaartha visheshalu
23:16
-
0
Comments
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి మూడో సమావేశం ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, జావడేకర్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు,ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. 15ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక ప్రధాన ఏజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. తొలుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభోపన్యాసం చేశారు.
అన్ని రాష్ట్రాలు, అందరు ముఖ్యమంత్రులు సమష్టిగా కృషిచేస్తేనే నవభారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు. జీఎస్టీపై ఏకాభిప్రాయానికి రావడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ‘ఒకే దేశం, ఒకే ఆశయం, ఒకే నిర్ణయం’ ఇదే జీఎస్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ‘ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు’ అని ప్రధాని ఈ సందర్భంగా నినాదాన్ని ఇచ్చారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగాలని కోరారు. ఈసందర్భంగా 15ఏళ్ల ప్రణాళికపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా ప్రజెంటేషన్ ఇచ్చారు.
No comments
Post a Comment