తాజా వార్తలు

Monday, 24 April 2017

మోడీకి గట్టి వార్నింగ్!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కేంద్రం మీదే ధ్వజ మెత్తాడు. మన భాష, జాతి, సంస్కృతులను కేంద్రం గౌరవించలేక పోతే, మన దేశ సమగ్రతను కాపాడలేకపోతే వేర్పాటు ఉద్యమాలకు ఊపిరి పోసినట్టే అవుతుందని ట్వీట్ చేశాడు. అంతకుముందు ఉత్తరాది పెత్తనం వద్దని కూడా పేర్కొన్నాడు.మంత్రులు, పార్టీ నేతలంతా ఇకపై హిందీలోనే మాట్లాడాలంటూ ప్రధాని మోదీ చేసిన సూచన నేపథ్యంలో హిందీ గో బ్యాక్ అంటూ ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని పవన్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఉత్తరాది నాయకులు ఇకనైనా పరిస్థితులను అర్థం చేసుకుని దేశంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవించాలని ఆయన కోరాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment