తాజా వార్తలు

Tuesday, 11 April 2017

రోజు 12 గంటల అవిశ్రాంత పని : పవన్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల ఓ మాట‌న్నారు. నేను ఏ ప‌ని చేస్తానో ఆ ప‌ని మ‌న‌సు పెట్టి చేస్తాను! అందుకే నాకు ఈ స్థాయి ద‌క్కింది. బ‌ర్రెలు క‌డ‌గాలంటే ఆ ప‌ని కూడా అంతే ఇష్టంగా చేస్తాన‌ని అన్నాడు. నిజ‌మే ప‌వ‌న్ క‌మిట్‌మెంట్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప‌వ‌ర్‌స్టార్‌ ఇటీవ‌లే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొద‌లెట్టేసి సెట్‌లో సీరియ‌స్‌గానే షూటింగులో పాల్గొంటున్నారు. ఈ సినిమాని కేవ‌లం 3 నెల‌ల్లో పూర్తి చేయాల్సి ఉంది.

ప‌వ‌న్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా మూడు నెల‌ల్లో పూర్త‌వ్వ‌డం అంటే క‌త్తిమీద సామే క‌దా! అందుకే త్రివిక్ర‌మ్ నానా హైరానా ప‌డుతున్నాడుట‌. అయితే త‌న స్నేహితుడికి ఏ క‌ష్టం రాకుండా ప‌వ‌న్ కూడా అంతే జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఎట్టిప‌రిస్థితిలో డెడ్‌లైన్ ప్ర‌కారం సినిమా పూర్త‌వ్వాలంటే తాను రోజూ 12 గంట‌లు అవిశ్రాంతంగా ప‌నిచేయాల‌ని డిసైడ్ అయ్యాడుట ప‌వ‌న్‌. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న తొలి షెడ్యూల్ లో కొన్ని స‌న్నివేశాలు, తేలిక‌పాటి యాక్ష‌న్ సీన్స్ తీస్తున్నారు. సెట్‌లో దాదాపు 12 గంట‌ల పాటు ప‌వ‌న్ శ్ర‌మిస్తున్నారుట‌. ఇక సినిమా పూర్త‌య్యేవ‌ర‌కూ ఇదే తీరుగా ప‌నిచేస్తాన‌ని ప‌వ‌న్ మాటిచ్చారట‌. ఎట్టి ప‌రిస్థితిలో జూలై తొలి వారానికి సినిమా పూర్తి చేసి ఆగ‌ష్టు 11న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అటుపై ద‌స‌రా సెల‌వుల్ని క్యాష్ చేసుకోవాల‌న్న‌ది అంద‌రి టార్గెట్‌. అన్న‌ట్టు ఇంత శ్ర‌మిస్తున్నాడు కాబ‌ట్టి ప‌వ‌న్ పారితోషికం మునుప‌టి కంటే మ‌రో వంతు పెరిగింద‌ని చెబుతున్నారు
« PREV
NEXT »

No comments

Post a Comment