తాజా వార్తలు

Wednesday, 12 April 2017

పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఇక రోజూ మార్పు

ఇంధన ధరలను రోజువారీ సమీక్షించాలని ప్రభుత్వ ఇంధన సంస్థలు భావిస్తున్నాయి. వీటిని ప్రయోగాత్మకంగా దేశంలోని ఐదు నగరాల్లో అమలు చేసి తర్వాత దేశవాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైజాగ్‌తో పాటు పుదుచ్చేరి, ఉదయ్‌పూర్‌, జంషెడ్‌పూర్‌, ఛండీఘర్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ దాదాపు 90శాతం రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నాయి. ఈ మూడు సంస్థలకు ఇప్పుడు ఎంపిక చేయాలని భావిస్తున్న ఐదు పట్టణాల్లో 200కుపైగా రిటైల్‌ బంకులు ఉన్నాయి. ఈ నగరాల్లో తొలుత రోజువారీ ఇంధన ధరల విధానం అమలు చేసి.. సందర్భంగా వచ్చే సమస్యలపై అధ్యయనం చేస్తాయి. కానీ
ఈ వార్తలపై ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక రిలయన్స్‌ , ఎస్సార్‌ సంస్థలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.ఇంధన ధరలను రోజువారీ సమీక్షించాలని ప్రభుత్వ ఇంధన సంస్థలు భావిస్తున్నాయి. వీటిని ప్రయోగాత్మకంగా దేశంలోని ఐదు నగరాల్లో అమలు చేసి తర్వాత దేశవాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైజాగ్‌తో పాటు పుదుచ్చేరి, ఉదయ్‌పూర్‌, జంషెడ్‌పూర్‌, ఛండీఘర్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ దాదాపు 90శాతం రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నాయి. ఈ మూడు సంస్థలకు ఇప్పుడు ఎంపిక చేయాలని భావిస్తున్న ఐదు పట్టణాల్లో 200కుపైగా రిటైల్‌ బంకులు ఉన్నాయి. ఈ నగరాల్లో తొలుత రోజువారీ ఇంధన ధరల విధానం అమలు చేసి.. సందర్భంగా వచ్చే సమస్యలపై అధ్యయనం చేస్తాయి. కానీ ఈ వార్తలపై ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక రిలయన్స్‌ , ఎస్సార్‌ సంస్థలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment