తాజా వార్తలు

Saturday, 8 April 2017

రేవంత్ పై వదంతులు!

తెలుగుదేశం వర్కింగ్ అద్యక్షుడు , కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీలో ఉండరని, బిజెపిలో చేరతారనో, కాంగ్రెస్ లో చేరతారనో తరచు వార్తలు వస్తున్నాయి.వాటిని ఆయన ప్రత్యేకించి ఖండించవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.కాంగ్రెస్ పార్టీలో కి రేవంత్ వెళ్లవచ్చని వార్తలు వచ్చినప్పుడు ఆయన సీరియస్ గా మాట్లాడారు.కాంగ్రెస్ కే దిక్కులేదన్నట్లుగా , టిఆర్ఎస్ తో మాచ్ పిక్సింగ్ గా వ్యవహరిస్తోందని రేవంత్ కామెంట్ చేశారు. బిజెపిలో చేరవచ్చని కధనాలు వస్తే, అందులో నిజం లేదని,తాను టిడిపి వదలి వెళ్లడం లేదని అన్నారు. కాగా టిడిపి,బిజెపి మిత్ర పక్షాలని , తెలంగాణలో బిజెపి బలపడితే మంచిదేనని ఆయన అన్నారు.టిడిపితో తెలంగాణలో పొత్తు ఉండదని చె్ప్పవలసింది తెలంగాణ బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ కాదని, జాతీయ అద్యక్షుడు అమిత్ సా, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు.తెలంగాణలో టిడిపి భవిష్యత్తు మీద నీలి నీడలు అలుముకుంటున్న తరుణంలో రేవంత్ పై తరచు ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఎపిలో టిడిపి అదికారంలో ఉండడంతో రేవంత్ వంటి నేతలు మరికొంతకాలం పరిస్తితి మారుతుందేమోనని ఎదురు చూస్తారని అనుకోవాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment