తాజా వార్తలు

Saturday, 22 April 2017

కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రసంగానికి పార్టీ నేతల నుండే స్పందన రాలేదని విమర్శించారు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి… సీఎం పనితీరు ఎలా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. సీఎం కేసీఆర్ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకునే స్థితికి చేరారని వ్యాఖ్యానించారు.

రైతుల స‌మ‌స్యల‌ను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించిన రేవంత్‌రెడ్డి… రైతాంగాన్ని మభ్యపెట్టేందుకే ఉచిత ఎరువుల పథకం ప్రకటించారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ రాష్ట్రం పేరుతో చెప్పిన మాటలే చెబుతే ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు… ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
« PREV
NEXT »

No comments

Post a Comment