తాజా వార్తలు

Tuesday, 11 April 2017

ఇంకా అఖిల్‌ని మ‌ర్చిపోలేక‌పోతోంది!

ఎన్నో ఆశ‌ల‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది స‌యేషా సైగ‌ల్‌. అక్కినేని వార‌సుడి స‌ర‌స‌న లాంచ్ అవుతున్నా ఇక స్టార్ స్టాట‌స్ వ‌చ్చేసిన‌ట్టేన‌ని భావించింది. బోలెడు క‌ల‌లు గంది. కానీ అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వు క‌దా! తానొక‌టి త‌లిస్తే విధి ఇంకొక‌టి త‌ల‌చింది. అందుకే తొలి సినిమానే పెద్ద ఫ్లాప్ అయ్యి త‌న క‌ల‌ల్ని క‌ల్ల‌లు చేసింది. సౌత్‌లో తొలి ఎటెంప్ట్ ఫెయిలైంది స‌రే క‌నీసం బాలీవుడ్లో అయినా కుదురుకుందా? అంటే అక్క‌డా తొలి ప్ర‌య‌త్నం పెద్ద బాంబ్ పేల్చింది. దాంతో ఈ అమ్మ‌డికి ఎటూ పాలుపోని ప‌రిస్థితి ఎదురైంది. తెలుగులో ‘అఖిల్‌’, హిందీలో ‘శివాయ్‌’ రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ఫ్లాప్స్‌. అఖిల్‌, అజ‌య్ దేవ‌గ‌న్ లాంటి వాళ్లే హిట్లు ఇవ్వ‌లేక‌పోయారు. దీంతో ఆ ప్ర‌భావం స‌యేషా సైగ‌ల్ కెరీర్‌పై ప‌డింది. అయితే సైరాభాను అంత‌టి పెద్ద స్టార్‌కి మ‌న‌వ‌రాలిగా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఈ భామ ప్ర‌స్తుతం ఓ రెండు త‌మిళ చిత్రాల్లో ఈజీగా ఛాన్సులు అందుకుంది. జ‌యంర‌వి స‌ర‌స‌న ‘వ‌న‌మ‌గ‌న్‌’లో, విశాల్‌- కార్తీ మ‌ల్టీస్టార‌ర్‌లో ‘క‌రుప్పు రాజా వెళ్లై రాజా’ (ప్ర‌భుదేవా ద‌ర్శ‌కుడు) చిత్రాల్లో నాయిక‌గా న‌టిస్తోంది. ఈ రెండు సినిమాలు త‌న కెరీర్ ని చ‌క్క‌దిద్దుతాయ‌ని ఆశిస్తోందిట‌.

“సౌత్‌లో చాలా బిజీగా ఉన్నా. అందుకే హిందీలో న‌టించ‌డం లేదు. సౌత్ సినిమాలు వేగంగా పూర్త‌వుతాయి. బాలీవుడ్‌లో అయితే ఒకే సినిమా కోసం ఎక్కువ టైమ్ వేస్ట్ చేయాలి” అంటూ చెప్పుకొచ్చింది. అన్న‌ట్టు `అఖిల్‌` ఫెయిలైనా అది త‌న జీవితానికి ఎంతో స్పెష‌ల్ అనీ చెబుతోంది. దీన్ని బ‌ట్టి తాను ఎటువైపు మూవ్ అవుతున్నా అఖిల్‌ని మాత్రం మ‌ర్చిపోలేక‌పోతోంద‌న్న‌మాట‌!

« PREV
NEXT »

No comments

Post a Comment