తాజా వార్తలు

Wednesday, 12 April 2017

నన్ను అసభ్యంగా తాకేవాడు: శిల్పా షిండే

‘నేను ఎన్నో ఎదుర్కొన్నాను. నా స్థానంలో ఎవరైనా ఉంటే.. వారు ఆత్మహత్య చేసుకొని ఉండేవారు’ అంటూ ప్రముఖ నటి శిల్పా షిండే ఆవేదన వ్యక్తం చేశారు. 'బాబీజీ ఘర్‌ పర్‌ హై' వెబ్‌ సిరీస్‌తో ఫేమస్‌ అయిన ఆమె ఇటీవల ఆ షో నిర్మాత సంజయ్‌ కోహ్లిపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. నిర్మాత కోహ్లి తనను లైంగికంగా వేధించాడని, అసభ్యంగా తాకేవాడని ఆమె ఆరోపించగా.. ఈ విషయంలో ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశావంటూ మరో నటి కవితా కౌషిక్‌ మండిపడ్డారు.

తాజాగా కవితా కౌషిక్‌ వ్యాఖ్యలపై శిల్పా స్పందిస్తూ.. ‘ప్రజలు ఎన్నైనా చెప్తారు. నేను డబ్బు కోసమో లేక మరొక దానికోసమో ఇందంతా చేస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ భిన్నమైన అనుభవాలు ఉంటాయి. నాకు ఎన్నో విషయాలు ఎదురయ్యాయి. వాటిని నాదైన శైలిలో ఎదుర్కొనేందుకు ప్రయత్నించాను.  ఇలాంటి విషయాల (లైంగిక వేధింపుల) గురించి మాట్లాడటం అంత సులభం కాదు. ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండాలని ప్రజలు సలహా ఇస్తారు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఆలస్యంగా ఎందుకు చేశావని ప్రశ్నిస్తారు. నిజమే నేను ఆలస్యంగా ఫిర్యాదు చేయడం ద్వారా అమ్మాయిలకు తప్పుడు సంకేతాలు ఇచ్చి ఉండొచ్చు.

ఆమె (కవిత) చెప్పింది సరైనదే. ఇలాంటి విషయాల్లో వేచి చూడకూడదు. వెంటనే చెప్పేయాలి. వేచిచూసినా మిమ్మల్నే తప్పుపడతారు. కానీ, అమ్మాయిలకు ఆ సంకోచం ఎప్పుడూ ఉంటుంది. ఘా విషయాలు బయటకు చెప్పడం అంత సులభం కాదు’ అని ఆమె వివరించారు. తాను గత ఏడాదే ’బాబీ ఘర్‌ పర్‌ హై’షో నుంచి తప్పుకున్నానని, సంజయ్‌, అతని భార్య బెనాఫేర్‌ తనను మానసికంగా వేధించారని పేర్కొన్నారు. తనకు రావాల్సిన రెమ్యూనరేషన్‌ రూ. 32 లక్షలను పొందేందుకు ఇప్పటికీ వారితో పోరాడుతున్నట్టు చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment