తాజా వార్తలు

Monday, 17 April 2017

సుప్రీం కోర్టులో కేసీఆర్‌కు షాక్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రింకోర్టులో చుక్కెదురైంది. సింగరేణి కాలరీస్ కంపెనీలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.దీనిని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్దం అని వారు పేర్కొన్నారు. హైకోర్టు కూడా వీరి వాదనను సమర్ధిస్తూ వారసత్వ ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది.దానిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.హైకోర్టు ఇచ్చిన తీర్పు ను సుప్రిం కూడా సమర్ధించింది. వారసత్వ ఉద్యోగాలు రాజ్యాంగ విరుద్దమని అబిప్రాయపడినట్లు సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment