తాజా వార్తలు

Tuesday, 11 April 2017

జగన్ వైపు శిల్పా మోహన్‌రెడ్డి చూపు!

నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి తన నివాసంలో కార్యకర్తలతో రహస్యంగా భేటీ అయ్యారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీ తనకు టికెట్‌ ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ తనకు టికెట్‌ ఇవ్వకుండా భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ఇస్తే.. టీడీపీని వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నంద్యాల ముఖ్యనాయకుడు నాగిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సులోచన, కౌన్సిలర్లతో విడివిడిగా ఆయన మంతనాలు జరిపారు. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

« PREV
NEXT »

No comments

Post a Comment