తాజా వార్తలు

Saturday, 8 April 2017

కీచక టీచర్ : విద్యార్థినితో అసభ్య ప్రవర్తన

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే విద్యార్థినుల పట్ల కీచకుడిగా మారాడు. ఉపాధ్యాయుడి వికృత చేష్టలను తట్టుకోలేని బాలిక తల్లిదండ్రులకు గోడు వెళ్లబోసుకుంది. దీంతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై బాలిక బంధువులు దాడి చేశారు. నగరంలోని ఉప్పల్‌ భరత్‌ నగర్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో బాధిత బాలిక ఆరోతరగతి చదువుతోంది. నవీన్‌ అనే ఉపాధ్యాయుడు బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు పాఠశాలకు వచ్చి నవీన్‌కు దేహశుద్ధి చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి వెంటనే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని బాలిక కుటుంబసభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
« PREV
NEXT »

No comments

Post a Comment