తాజా వార్తలు

Friday, 7 April 2017

మత్తుమందుకు బానిసను చేసి యువతీ పై ..

కామాంధులు యువతులపై విరుచుకుపడుతున్నారు. కామవాంఛ తీర్చుకోడానికి ఎంతకైనా తెగాయిస్తున్నారు దుర్మార్గులు. హైదరాబాద్‌ మియాపూర్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి అయిన ఓ యువతి(25)కి సిగరెట్ల రూపంలో మత్తుమందు అలవాటు చేసి.. మొయినుద్దీన్ అనే దుర్మర్గుడు రెండు సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. గురువారం మరో సారి అత్యాచారానికి పాల్పడడంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో విషయం బహిర్గతమైంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు… నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… విచారిస్తున్నారు.

అయితే, నిందితుడు మలక్ పేట్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. నిందితుడు బాధితురాలికి స్నేహితుడని.. మూడేళ్ల క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం అయినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితురాలు కోలుకున్న తర్వాత ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించి తదుపరి విచారణ కొనసాగిస్తామని తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment