తాజా వార్తలు

Friday, 7 April 2017

తెలంగాణ పోలీస్ శాఖలో కలవరం..

తెలంగాణలో ఎస్సై ఎగ్జామ్ నిర్వహించి... ఏడాది అయిపోయింది. కానీ.. ఇప్పటికీ రిజల్ట్ రాలేదు. దీంతో.. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఫలితాలు వస్తాయో.. రావో.. తెలియక.. ఇన్నాళ్లూ.. దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. చివరకు రిజల్ట్స్ కోసం.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించారు.
ఇప్పటికే కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనతో.. సతమతమవుతున్న తెలంగాణలో పోలీస్ శాఖలో.. ఇప్పుడు ‌పరీక్షా ఫలితాల కోసం ఎస్సై అభ్యర్థులు ముట్టడికి ప్రయత్నించడం కలవరపెడుతోంది. ఏడాది క్రితం రాసిన ఎస్సై పరీక్ష రిజల్ట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు పోలీస్ శాఖ. దీంతో.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు వచ్చారు అభ్యర్థులు.
« PREV
NEXT »

No comments

Post a Comment