తాజా వార్తలు

Tuesday, 11 April 2017

కేశినేని నాని మరో వివాదం

విజయవాడ తెలుగుదేశం ఎమ్.పి కేశినేని నాని కి చెందిన కేశినేని ట్రావెల్స్ బస్ లలో పనిచేసిన డ్రైవర్లు, ఇతర సిబ్బందికి దాదాపు ఏడాదిగా జీతాలు ఇవ్వకపోవడం శోచనీయమే. సడన్ గా ట్రావెల్స్ ను మూసివేస్తున్నట్లు నాని ప్రకటించడంతో వారంతా ఉద్యోగాలు కోల్పోయారు. అంతేకాక ఏడాదిగా తమకు జీతాలు సక్రమం ఇవ్వడం లేదని, తమ బకాయిలు తమకు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ నెల పదిహేను లోగా జీతాలు చెల్లించకపోతే పదిహేడో తేదీన విజయవాడలో కుటుంబాలతో సహా ఆందోళనకు దిగుతామని సిబ్బంది హెచ్చరించారు.సిబ్బందికి , ట్రావెల్స్ నిర్వాహకులకు మద్య వాగ్వాదం జరుగుతుండగా, నాని సన్నిహితుడు ఫణి అక్కడకు వచ్చి పదిహేనో తేదీన వారి జీతాలను బ్యాంకులో జమ చేస్తామని హామీ ఇచ్చారు. అలా చేయకపోతే పదహారు నానితో చర్చలకు అవకాశం ఇస్తామని తెలిపారు.

« PREV
NEXT »

No comments

Post a Comment