తాజా వార్తలు

Monday, 17 April 2017

అది ద్రౌపది వస్త్రాపహరణతో సమానం : సీఎం యోగి

ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని ద్రౌపది వస్త్రాపహరణంతో పోల్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ పై రాసిన పుస్తకాన్ని ఈ రోజు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ, ముస్లింలు ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని, ఉమ్మడి పౌరస్మృతి విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ట్రిపుల్ తలాక్ విధానంపై కొంతమంది మౌనంగా ఉంటున్నారని, వారిని దోషులుగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. ట్రిపుల్ తలాక్ విధానంపై ముస్లిం మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోందని అన్నారు. ఈ విధానాన్ని రద్దు చేస్తామని భావించే యూపీ ఎన్నికల్లో చాలా మంది ముస్లిం మహిళలు తమ పార్టీకి ఓటు వేశామని ఇప్పటికే చెప్పారని అన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment