తాజా వార్తలు

Friday, 7 April 2017

పూరీకి నో చెప్పిన వెంకీ

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వెంకటేష్‌ ఒక మూవీలో నటించాలనుకుంటున్నట్లు, బాలయ్యతో మూవీ కంప్లీట్‌ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మూవీతో వెంకటేష్‌ నిర్మాతగా కూడా మారబోతున్నట్లు తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం పూరీని వెంకీ వద్దనుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.

బడ్జెట్‌ విషయంలో తర్జన భర్జనలు రావడంతో పాటు పూరీ ఈ మధ్య వరుస ఫ్లాప్‌ల్లో ఉండటంతో వెంకీ ఈ ప్రాజెక్ట్‌ను వద్దనుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు విభిన్న కథల వైపు చూస్తున్న వెంకీ, కొత్త దర్శకులతో చేసేందుకు ఇంట్రస్ట్‌గా ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment