తాజా వార్తలు

Friday, 7 April 2017

అమెరికాలో మరో భారతీయుడు మృతి

అమెరికాలో మరో భారతీయుడు మృతి చెందాడు. దోపిడి దొంగల చేతిలో పంజాబ్‌కు చెందిన విక్రమ్ జర్యాల్ మృతి చెందాడు. వాషింగ్టన్‌లోని ఏఎమ్ - పీఎమ్‌ అనే గ్యాస్ స్టేషన్‌లో క్లర్క్‌గా విక్రమ్ పనిచేస్తున్నాడు. నిన్న గ్యాస్ స్టేషన్‌లో దొపిడికి పాల్పడిన ఇద్దరు దొంగలు... కౌంటర్లో డబ్బులు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అడ్డుకోబోయిన జర్యాల్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ముసుగులు ధరించిన వీరు... విక్రమ్‌పై కాల్పులు జరిపారు. గాయపడిన విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పంజాబ్‌లోని హోషియార్పూర్‌ జిల్లాకు చెందిన విక్రమ్‌ నెల క్రితమే అమెరికాకు వెళ్లాడు. విక్రమ్‌పై కాల్పులు జాత్యాహంకార దాడేనని భారతీయులు ఆరోపిస్తున్నారు. తన సోదరుడి దారుణ హత్య విషయాన్ని ఆయన సోదరుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకొచ్చారు. మృతదేహాన్ని పంజాబ్‌లోని తమ స్వస్థలం హోషియార్‌పూర్‌కు తీసుకురావడంలో సహకరించాలని కోరారు. విక్రమ్ హత్యను సుష్మ స్వరాజ్ ఖండించారు. విక్రమ్ మృతదేహం భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని.. భారత ఎంబసీని సుష్మా ఆదేశించారు. అంతే కాకుండా కాల్పుల ఘటనకు సంబంధించి అన్ని వివరాలు సేకరించాలని సూచించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment