తాజా వార్తలు

Thursday, 13 April 2017

ధనుష్‌ను హెచ్చరించిన హీరోయిన్

తమిళ స్టార్ హీరో ధనుష్‌ను హీరోయిన్ మనోనా సెబాస్టియన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మాట అదుపులో పెట్టుకోండి అంటూ ధనుష్ ను హెచ్చరించిందట ఈ భామ. అలా వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. 
ధనుష్ మొదటిసారిగా దర‌్శకత్వం వహించిన పవర్ పాండి అనే సినిమాలో మడోనా గెస్ట్ రోల్‌లో నటించింది. దీనికి మడోనా అడిగిన మొత్తం పారితోషికాన్ని కూడా అందించాడు ధనుష్. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మడోనాను పాల్గొనాలని ధనుష్ అండ్ టీం కోరారట.
అయితే ఆ ప్రచారానికి ఈ భామ గైర్హాజరైంది. డుమ్మాకొట్టింది. దీంతో ధనుష్ బృందం సభ్యులు ఆమెకు ఓ మెసేజ్ పెట్టారట. ఆ మెజేస్ కు రియాక్టయిన ఈ భామ.. మాట అదుపులో పెట్టుకోండి.. ఎవరైనా సరే అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రమోషన్స్ కు ఎందుకు పాల్గొనలేదని అడిగినందుకే ఇలాంటి వార్నింగ్ లు కూడా ఇస్తుందా అంటూ మడోనా పై నిర్మాత మండలిలో ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment