తాజా వార్తలు

Saturday, 22 April 2017

రాజకీయాల్లోకి జగన్ సతీమణి భారతి..!

వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి రాజకీయాల్లోకి రానున్నారా? అంటే పరిస్థితులు మాత్రం ఆమెను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చేలా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారని ఓ ఛానెల్ ప్రకటించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేసింది. వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో వైఎస్ విజయమ్మ విశాఖపట్టణం నుంచి పోటీ చేసి, పరాజయం పాలుకాగా, రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల వైఎస్సార్సీపీ ప్రచారకర్తగా వ్యవహరించారు. అనంతరం క్రియాశీలక రాజకీయాల్లో ఆమె పెద్దగా కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో రేపు కోర్టు తీర్పు ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా వచ్చినా, పార్టీని నడిపించే బాధ్యతను వైఎస్. భారతి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment