తాజా వార్తలు

Monday, 17 April 2017

దేవినేని ఉమా పిచ్చికుక్క, ఉన్మాది : వైసీపీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మంత్రి ఉమ పిచ్చికుక్క, ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందని ఉమ ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో నిలదీసిన తమపై బురద జల్లుతారా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారా.. మీ చేతగాని తనాన్ని ఒప్పుకుంటారా? ఉమ చేతగాని దద్దమ్మ..బ్రోకరిజంలో నంబర్ వన్. అందుకే, ఉమను మంత్రి పదవి నుంచి తొలగించలేదు. పెరిగిన పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఎవరు భరిస్తారు? రాష్ట్రం భరిస్తుందా? కేంద్ర భరిస్తుందో చెప్పాలి? ఏపీపై ఒక్క రూపాయి భారం పడినా ఎవరూ క్షమించరు. ఉమ, పిచ్చివాగుడు మాని మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అంటూ పార్థసారథి మండిపడ్డారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment