తాజా వార్తలు

Saturday, 22 April 2017

విజయసాయిరెడ్డికి కోపం వచ్చింది

వైఎస్ ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యాలయంపై పోలీసులు దాడి చేయడంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి తమ నేత వైఎస్ జగన్ పై పలు అభ్యంతరకర పోస్టింగ్ లు చేశారని, టిడిపి ఆఫీస్ లో సోదా చేసే దమ్ము పోలీసులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.రవికిరణ్ పెట్టిన పోస్టింగ్ ను తాను పెడతానని,తనపై చర్య తీసుకోండని ఆయన సవాల్ చేశారు.లోకేష్ పనికిమాలిన నాయకుడు, టిడి జనార్దన్ దళారి అని అతను ఇచ్చిన ఫిర్యాదుపై అసెంబ్లీ సెక్రటరీ స్పందించవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి కాని, తాబేదారులుగా ఉండరాదని అన్నారు.తాము అదికారంలోకి వస్తామని, అప్పుడు చర్యలు తప్పవని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌ ను దూషిస్తూ మంత్రి లోకేశ్‌ పెట్టిన ట్వీట్లను వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పోలీసులకు చూపించారు. వైఎస్‌ఆర్‌ సీపీలోని అన్ని విభాగాలకు తానే ఇంఛార్జ్‌ని అని, నోటీసులు ఇవ్వదలిస్తే తనకు ఇవ్వాలని ,తనపై చర్యలు తీసుకోవచ్చని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment