తాజా వార్తలు

Wednesday, 12 April 2017

ఈసీ దగ్గరకు ఫిరాయింపుల పంచాయితి..

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల కమిషన్ ను ఢిల్లీలో కలిశారు. ఏపీలో టీడీపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్ని అధికారపార్టీలో చేర్చుకోవటమే కాదు.. వారితో రాజీనామా చేయించకుండానే నలుగురికి మంత్రి పదవులు ఇవ్వటంపై ఫిర్యాదు చేశారు.

తమ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. నిర్ణీత సమయంలో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోని పక్షంలో, నోటీసులు పంపుతామని ఎన్నికల సంఘం చెప్పినట్లుగా పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment