తాజా వార్తలు

Tuesday, 11 April 2017

రాజధాని నడిబొడ్డులో వైసీపీ విజయం

రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక ఉప ఎన్నికలో అధికార టీడీపీకి ఎదురుగాలి వీచింది. టీడీపీ అభ్యర్ధి రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డుకు ఆదివారం ఉప ఎన్నిక జరిగింది. ఎన్నిక ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. ఇందులో టీడీపీ అభ్యర్ధి దర్నాసి రాజారావుపై వైసీపీ అభ్యర్ధి మేరుగమల్లి వెంకటరమణ 153 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజధాని ప్రాంతంలో టిడిపి సీటును వైసీపీ కైవసం చేసుకోవడంతో టీడీపీ నాయకులు అయోమయంలో పడ్డారు.
 
2014 ఎన్నికల్లో ఈ వార్డు నుంచి కౌన్సిలరుగా గెలుపొందిన టీడీపీ అభ్యర్థి మురళీకృష్ణ వ్యక్తిగత రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, ఈ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ జరిగింది.
« PREV
NEXT »

No comments

Post a Comment