తాజా వార్తలు

Wednesday, 3 May 2017

ఈ సూత్రాలు పాటిస్తే జీవితం ఆనందమయమే..

భార్యాభర్తలు ఈ ఏడు సూత్రాలు పాటిస్తే కచ్చితంగా వారి జీవితం ఆనందంగా ఉంటుంది. కేవలం రాత్రి సమయంలోనే భార్యతో భర్త చనువుగా ప్రవర్తిస్తే ఆమెకు మీపై అంతగా ప్రేమ ఏర్పడదు. మీకు ఖాళీగా ఉన్న ప్రతి క్షణాన్ని ఆమెతో హాయిగా గడిపేందుకు ప్లాన్ చేసుకుంటే మీ లైఫ్ అంతా ఫుల్ హ్యాపీ. రోల్ ఎక్స్ఛేంజ్ : భార్యాభర్తలిద్దరూ అప్పుడప్పుడు వారి రోల్స్ ను చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దీంతో ఆ సందర్భాల్లో మీరు కాస్త డిఫరెంట్ మూడ్ లోకి వెళ్లిపోతారు. ఆనందంగా ఉండడానికి కపుల్స్ అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి. 
హెల్తీ కాంపిటేషన్: ఇద్దరి మధ్య హెల్తీ కాంపిటేషన్ ఉండడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అందువల్ల మీరిద్దరూ చేసే పనుల్లో కాస్త పోటీతత్వాన్ని ఏర్పరుచుకోవాలి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పార్టీల కోసం ప్లాన్ చేసుకోండి: రోజూ పని ఒత్తిడితో ఇద్దరూ సతమతమవుతుంటారు. అందువల్ల అప్పుడప్పడు పార్టీస్ కు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉండండి. మీ ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భాలుంటే కాస్త గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్ ను, కుటుంబ సభ్యులను, బంధువులను ఆహ్వానించి ఆ రోజు హ్యాపీగా గడపండి. ఇలా చేయడం వల్ల మీలో కొత్త ఉల్లాసం వస్తుంది.

ఇద్దరూ కలిసి వంట చేయండి: చాలామంది కపుల్స్ ఇలా చేయరు. వారంలో ఒక్కరోజైనా అంటే ఆదివారంలాంటి సమయాల్లో మీ భార్యకు వంట విషయంలో కాస్త హెల్ప్ చేస్తే ఆమె ఎంతో ఆనందపడుతుంది.

ఏదైనా నేర్చుకోండి: మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి మరొక బెస్ట్ ఆప్షన్ కలిసి నేర్చుకోవడం. ఏదైనా కొత్త భాషకానీ లేదా డ్యాన్స్, మ్యూజిక్ ఇలా ఇద్దరికీ ఇష్టమైన వాటిని కలిసి నేర్చుకోండి. దీంతో ఇద్దరి మధ్య మరింత ప్రేమ బలపడుతుంది.

చదవండి: ఈ కాలంలో చాలామంది కపుల్స్ ఏదో చదివే లక్షణం గల వారే ఎక్కువగా ఉన్నారు. అయితే వేర్వేరుగా కాకుండా ఇద్దరూ కలిసి చదువుకునేలా ప్లాన్ చేసుకోండి. మీరు చదివిన బుక్ లో విషయాలను మీ పార్టనర్ తో షేర్ చేసుకోండి. తను చదివిన విషయాలను అడిగి తెలుసుకోండి. ఇలా ఈ విషయాలన్నీ పాటించడం ద్వారా మీ మధ్య ప్రేమ మరింత బలపడుతుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment