తాజా వార్తలు

Wednesday, 3 May 2017

జగన్‌కు లోకేష్‌ సవాల్‌!

తనపై ప్రతిపక్ష నేత జగన్‌ చేసిన ఆరోపణలకు ప్రతి సవాల్‌ను విసిరారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌. జగన్‌కు 24గంటల సమయం ఇస్తున్నానని, ఆ సమయంలోపు తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలి, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఛాలెంజ్‌ చేశారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన జగన్‌, ఇతర సీఎం కొడుకులు కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

ఇక జగన్‌ 11 ఛార్జ్‌షీట్లలో జగన్‌ ఏ1 ముద్దాయి, 23 కేసుల్లో 420 అని, 16 నెలలు జైల్లో ఉన్న అతడి నేర చరిత్రను ప్రజలు మర్చిపోలేదని విమర్శించారు. అయితే గుంటూరు వేదికగా జగన్‌ చేపట్టిన రైతు దీక్షలో లోకేష్‌పై ఆయన పలు కామెంట్‌లు చేసిన విషయం తెలిసిందే. టీడీపీలోని కొందరు లోకేష్‌ను లోక్యాష్‌ అని పిలుచుకుంటున్నారంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయ్యాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment