తాజా వార్తలు

Wednesday, 3 May 2017

అక్కినేని కుటుంభం లక్ష్యంగా విమర్శలు!

తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ,ఇప్పుడు తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆంద్రావారికి ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇస్తున్నారని టిడిపి వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వెటర్నరీ విద్యార్దుల దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాస్ట్రంలోనే తమకు న్యాయం జరిగిందని వారు వాపోతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కేంద్రం ప్రకటించిన ఐఐటిఆర్ కు కృష్ణా జిల్లాకు చెందిన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని సి.ఇఓ.గా నియమించారని, తెలంగాణ బిడ్డలు ఎవరూ ఆ పదవికి దొరకలేదా అని రేవంత్ ప్రశ్నించారు.మెట్రో రైల్ సి.ఎమ్.డి గా ఉన్న ఎన్.వి.ఎస్.రెడ్డి రాజమండ్రికి చెందినవారని,ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించారని రేవంత్ అన్నారు.తమకు కమిషన్ లు బాగా ముట్టచెబుతారనే ఆంద్రవారిని ఈ ఉద్యోగాలలో నియమిస్తున్నారని ఆయన ఆరోపించారు.నటి కేరళకు చెందిన సమంతను చేనేత అంబాసిడర్ గా నియమించారని, ఆమె అత్త అమలకు పిచ్చికుక్కల పెంపకం కోసం జూబ్లి హిల్స్ లో మూడు ఎకరాల ఖరీదైన స్థలం ఇచ్చారని ఆయన అన్నారు.ఆంద్ర కుక్కలకు ఉన్న విలువ తెలంగాణ బిడ్డలకు లేదా అని రేవంత్ ప్రశ్నింఆచారు.తెలంగాణకు ద్రోహం చేస్తున్నారనే ఓయులో విద్యార్దులు ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టడానికి సిద్దమయ్యారని ఆయన అన్నారు.రేవంత్ మరీ ఘాటు పెంచుతున్నారా!
« PREV
NEXT »

No comments

Post a Comment