తాజా వార్తలు

Wednesday, 3 May 2017

భార్య ప్రొఫైల్ ఫోటోయే ఆత్మహత్యకు కారణమా!

తెలుగు టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆయన ఫ్యామిలీలో తలెత్తిన విభేదాల వల్లే సూసైడ్ చేసుకున్నాడని బంధువులు చెబుతున్నమాట.. భార్య పావనీరెడ్డి ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ఫోటోపై భార్యభర్తల మధ్య  బుధవారం తెల్లవారుజామున గొడవ జరిగిందని, తెల్లారేసరికి ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. 

మరోవైపు ప్రదీప్‌ భార్య పావనీరెడ్డి ...పోలీసులు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పావనీరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ప్రదీప్ షూటింగు నుండి రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారని, షూటింగులో బాగా అలసి పోయిన ఆయన తర్వాత బాగా డ్రింక్ చేసారని, ఈ క్రమంలో తమ ఇద్దరి మధ్య చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల వాదన జరిగిందని, దీనితో ఆయన అలిగి రూమ్ లో వెళ్లి డేర్ వేసుకున్నారని, తెల్లవారు ఝామున 5 గంటలకు ఆయనకు షూటింగ్ ఉందని లేపడానికి డోర్ కొడితే తీయలేదని, అనుమానం వచ్చి డోర్ బద్దలు కొడితే ఉరి వేసుకుని కనిపించారని పావని తెలిపారు.

కాగా గత మూడు నెలలుగా శ్రావణ్‌ అనే వ్యక్తి వాళ్లింట్లో ఉంటున్నాడని, అతడితో చనువుగా ఉన్న ఫోటోను పావనీ ప్రొఫైల్‌ గా పెట్టడంతో ప్రదీప్‌ మనస్తాపం చెందినట్లు సమాచారం.ఈ విషయంపై భార్యను ప్రదీప్‌ నిలదీయగా, అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అంతేకాకుండా భార్యభర్తల మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. అయితే పావనీరెడ్డి తీరుపై ప్రదీప్‌ కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సూసైడ్ నోట్ కనిపించకపోవడం, మృతదేహం మంచం కింద ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. క్లూస్ టీమ్ రంగంలోకి దిగడంతో త్వరలోనే ప్రదీప్ సూసైడ్ మిస్టరీ వీడుతుందేమో చూద్దాం. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రదీప్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment