తాజా వార్తలు

Wednesday, 18 October 2017

టీడీపీపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఎపి తెలుగుదేశం నేతలపై తెలంగాణ టిడిపి వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారని వార్తలు వస్తున్నాయి… ఎపి ఆర్దిక మంత్రి, సీనియర్ టిడిపి నేత యనమల రామకృష్ణుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెండువేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారని సంచలన ఆరోపణ చేశారు. కెసిఆర్ పై యనమల ఈగ వాలనివ్వరని ఆయన అన్నారు. పయ్యావుల కుమారుడు, యనమల అల్లుడు కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇక్కడి టీడీపీ నేతలను జైల్లళ్లో పెడుతుంటే.. ఏపీ టీడీపీ నేతలు మాత్రం కేసీఆర్‌కు వంగివంగి దండాలు పెట్టడం ఎంతవరకు సమయంజసం అని ప్రశ్నించారు. ‘కేసీఆర్‌ ఏపీ మంత్రి పరిటాల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు ఆయనకు ఏపీ టీడీపీ నేతలు వంగివంగి దండాలు పెట్టారు. మరి, చంద్రబాబు.. సీతక్క కుమారుడి పెళ్లికి వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ నాయకులు అలానే చేశారా? ఏపీలో పయ్యావుల కేశవ్‌ను ప్రజలు తిరస్కరించారు. అలాంటాయన నాపై విమర్శలు చేస్తాడా?’ అని రేవంత్‌ ప్రశ్నించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment