తాజా వార్తలు

Thursday, 19 October 2017

నా పెళ్ళికి మిమ్మల్ని తప్పకుండా ఆహ్వానిస్తా!

పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ స్టార్ మా టీవీలో ప్ర‌సారం అవుతోన్న ‘నీతోనే డ్యాన్స్ షో’కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా పాల్గొంటోన్న విష‌యం తెలిసిందే. ఈ షోలో రేణూ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. వ‌చ్చే శ‌ని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న ఈ షోకి సంబంధించిన ప్రొమోను ‘స్టార్ మా’ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఉంచింది. ఇందులో ఓ జంట చేసిన డ్యాన్స్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన రేణూ దేశాయ్‌.. ఆ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు క‌ంటతడి పెట్టిస్తున్నాయి. ‘నాకు ప్రేమ మీద కొంచెం నమ్మకం పోయింది.. కానీ మీ అనుబంధం చూసిన తర్వాత ఇప్పుడు మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను.. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటానో అప్పుడు మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా ఆహ్వానిస్తా’ అని రేణూ క‌న్నీరు పెట్టుకుంటూ ఆ జంట‌ను అభినందించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment