తాజా వార్తలు

Wednesday, 18 October 2017

‘రాజా ది గ్రేట్’ రివ్యూ

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ‘రాజా ది గ్రేట్’తో బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాడా? దాదాపు రెండేళ్లు గ్యాప్ ఇచ్చి చేసిన మూవీ ఇది. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా బుధవారం తెలుగురాష్ర్టాల్లో భారీ ఎత్తున రిలీజైంది. ఇటు హీరోయిన్ మెహరీన్, అటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా వరసహిట్లతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కాంబినేషన్ వర్కవుటయ్యిందా? లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్దాం..
కథ :
నిజాయతీ కలిగిన ఓ పోలీస్‌ ఆఫీసర్‌(ప్రకాష్‌రాజ్‌). ఆయనకో కుమార్తె లక్కీ(మెహరీన్‌). ఆ ఆఫీసర్‌కు కూతురంటే ప్రాణం. ఓ కేసు విషయంలో దేవ(వివ‌న్‌ భటేనా) తమ్ముడిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు ఆ పోలీస్‌ ఆఫీసర్‌. తన తమ్ముడిని చంపేశాడనే కోపంతో అతడిపైనా, అతని కుమార్తె లక్కీపైనా పగ పెంచుకుంటాడు దేవ. లక్కీ కళ్లముందే ఆమె తండ్రిని చంపేస్తాడు. అప్పటినుంచి దేవ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది లక్కీ. రాజా(రవితేజ) పుట్టుకతో అంధుడు. కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువ. రాజాను వాళ్ల అమ్మ(రాధిక‌) పోలీస్‌ ఆఫీసర్‌ చేయాలనుకుంటుంది. మరోపక్క దేవ నుంచి లక్కీని కాపాడేందుకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రయత్నిస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాజా ఏం చేశాడు? విలన్‌ గ్యాంగ్‌ నుంచి ఆమె ఎలా కాపాడాడు? అంధుడైన రాజా చివరికి ‘రాజా ది గ్రేట్‌’ అనిపించుకున్నాడా?
విశ్లేష‌ణ:
రెండేళ్ల తరువాత వెండితెర మీద కనిపించిన రవితేజ, మరోసారి తన మాస్ అప్పీల్ కు డోకా లేదని ప్రూవ్ చేశాడు. డబుల్ ఎనర్జీతో అలరించాడు. అంధుడి పాత్రలోనూ తనదైన హాస్యం పండించి ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ గా మెహరీన్ అందంగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో మంచి నటన కనబరిచింది. విలన్ గా వివన్, రవితేజతో పోటి పడి అలరించాడు. రాక్షసుడిలా కనిపిస్తూనే కామెడీ పండించటంలోనూ సక్సెస్ అయ్యాడు. స్టైలిష్ విలన్ గా వివన్ కు మరిన్ని అవకాశాలు రావటం ఖాయం. బుల్లితెర మీద ఎక్కువగా హుందాగా కనిపించే పాత్రలు మాత్రమే చేస్తున్న రాధిక వెండితెర మీద మాత్రం మంచి ఎంటర్ టైనింగ్ రోల్ లో అలరించింది. కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించింది. క్లైమాక్స్ లో రాధిక అనుభవం, నటన.. సీన్స్ మరింత ఎలివేట్ అయ్యేలా చేశాయి. హీరో ఫ్రెండ్ గా శ్రీనివాస్ రెడ్డి మరోసారి తనదైన నటనతో అలరించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, సంపత్, తనికెళ్ల భరణి తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాయికార్తీక్‌ మరోసారి తన సంగీతంతో మెప్పించాడు. టైటిల్‌ సాంగ్‌ బాగుంది. గున్నాగున్నామామిడి బీట్‌ నచ్చుంది. నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణపరంగా దిల్‌ రాజు సినిమాల్లో ఎలాంటి లోటూ ఉండదు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది. దర్శకుడు ఓ సాదాసీదా కథను తీసుకుని, హీరో పాత్రను సరికొత్తగా డిజైన్‌ చేసుకుని ప్రేక్షకులను మెప్పించాడు. కథానాయకుడు అంధుడు కావడంతో ఇది ఓ ఆర్ట్‌ సినిమా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనిల్‌ రావిపూడి దీన్నో పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మలచడంలో విజయం సాధించాడు.
రేటింగ్ : 3.0
« PREV
NEXT »

No comments

Post a Comment