తాజా వార్తలు

Thursday, 19 October 2017

బీట్‌రూట్‌తో రక్తహీనత దూరం..

మనం చాలా తక్కువగా వండే కూరల్లో బీట్‌రూట్‌ ఉంటుంది.. కానీ దాన్ని తరచూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావంటారు నిపుణులు.
* బీట్‌రూట్‌లో కెలొరీలు తక్కువ.. కొవ్వు అసలు ఉండదు. సన్నబడాలనుకునేవారు దీన్ని తరచూ తీసుకోవడం మంచిది. ఇక, దీన్ని రసం రూపంలో తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాల సంఖ్య పెరగడమే కాదు రక్తహీనత సమస్య కూడా ఎదురుకాకుండా ఉంటుంది.
* బీట్‌రూట్‌కి ఎరుపు రంగుని తెచ్చే బెటానిన్‌ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌. దీంతోపాటు ఉండే ఇతర పాలిఫినాల్స్‌.. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
* ఈ దుంపలో ఇనుము, పొటాషియం, మాంగనీసు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ పోషకాలన్నీ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పీచు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా సాగేందుకు తోడ్పడుతుంది.
* బీట్‌రూట్‌లో ఫోలేట్‌ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. గర్భిణులు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పుట్టబోయే పాపాయిలో నాడీ సంబంధ సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment