తాజా వార్తలు

Saturday, 21 October 2017

సెన్సార్ పూర్తిచేసుకున్నఉన్నది ఒకటే జిందగీ

నేను శైలజ లాంటి హిట్ సినిమా తర్వాత హైపర్ లాంటి మూవీతో డిజాష్టర్ చవిచూసిన హీరో రామ్ ఈసారి ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనే వెరైటీ లవ్ స్టోరీతో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ సరసన లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు. అక్టోబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇవాళ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఉన్నది ఒకటే జిందగీ సినిమా చూసిన సెన్సార్ బృందం.. సినిమాకు U సర్టిఫికెట్ కేటాయించింది.
ప్రేమ, స్నేహం.. రెండింటి మధ్య చోటుచోసుకునే పరిణామాల సమాహారమే ఈ ఉన్నది ఒకటే జిందగీ సినిమా కథాంశం. రామ్ హోమ్ ప్రొడక్షన్స్ అయిన స్రవంతి రవికిషోర్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. శ్రీ విష్ణు, పెళ్లిచూపులు ఫేమ్ ప్రియదర్శి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment