తాజా వార్తలు

Thursday, 19 October 2017

ఎవరి చిట్టా విప్పుతాడో!

ఏపీ టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి ఝలక్‌ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏపీ టీడీపీ నేతల్లో కలకలం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో ఏపీ టీడీపీ నేతల వ్యాపార లావాదేవీల చిట్టా విప్పడంతో వారంతా ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడి రూ.2వేల కోట్ల కాంట్రాక్ట్‌, పరిటాల, పయ్యావుల కుటుంబీకులకు బీర్ల కంపెనీల వ్యవహారాలను రేవంత్‌రెడ్డి బయటపెట్టడంతో ఏపీ మంత్రులు టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు.

ఇంకా ఎవరి లావాదేవీలు రేవంత్‌ రెడ్డి బయటపెడతారోనని వారు భయపడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో అసలు నిజాలు బయటపెడితే టీడీపీకి పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుందనే ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుగానీ, లోకేష్‌గానీ, మంత్రులుగాని నేరుగా స్పందించలేదు. రేవంత్‌రెడ్డి తాము విమర్శిస్తే మళ్లీ ఏ విషయం బయటపెడతారో అని వారు మల్లగుల్లాలు పడుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment