తాజా వార్తలు

Friday, 20 October 2017

మళ్ళీ వివాదంలో కమల్‌హాసన్‌!

రాజకీయల్లోకి వస్తున్నానని ఇటీవలే ప్రకటించిన తమిళ నటుడు కమలహాసన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు తమిళ ప్రజలకు పంపిణీ చేసే నీలవేంబు కుదినీర్ మందుపై కమల్‌ చేసిన వ్యాఖ్యలే తాజా వివాదానికి కారణమయ్యాయి. ఈ మందులోని ఓ కారకం మనుషుల్లో వంధ్యత్వానికి (ఇన్-ఫెర్టిలిటీ) దారితీస్తుందని ఆరోపిస్తూ.. ఈ మందును పంపిణీ చేయొద్దంటూ తన అభిమానులకు పిలుపునిచ్చారు.
ఈ ఆరోపణలు కమల్ పై కేసు నమోదయ్యేలా చేశాయి. కమల్ వ్యాఖ్యలు తమ హక్కుల్ని కాలరాసేలా ఉన్నాయంటూ ఈ మందు పంపిణీ సభ్యుల్లో ఒకరు చెన్నై కమిషనరేట్ కు ఫిర్యాదు చేశారు. మనుషుల భయాల్ని కమల్ అందిపుచ్చుకుంటున్నారని, తమిళనాడుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నీలవేంబు చెట్టు ఆకుల నుంచి తయారుచేసిన ఈ కషాయం వాడడం వల్ల మనుషులు నపుంసకులుగా తయారవుతారని కమల్ ఆరోపిస్తున్నారు. మరోవైపు తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా కమల్ వ్యాఖ్యల్ని ఖండించింది. ఈ కషాయం వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని స్పష్టం చేసింది. పూర్తి అవగాహన లేకుండా కమల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఆయన అభిమానులు వత్తాసు పలుకుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment