తాజా వార్తలు

Friday, 20 October 2017

టి.టిడిపి నేతల సమావేశంలో వాగ్వాదం!

ఎన్టీఆర్‌ భవన్‌లో తెలంగాణ తెదేపా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డితోపాటు ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్‌ గౌడ్‌, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ సమావేశంలో నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసిన విషయంపై రేవంత్‌రెడ్డిని మోత్కుపల్లి, అరవింద్‌ కుమార్‌గౌడ్‌ నిలదీసినట్లు తెలుస్తోంది. అధినేత అనుమతి లేకుండా రాహుల్‌ను ఎందుకు కలిశావని వారు రేవంత్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సమావేశం నుంచి అర్ధంతరంగా మోత్కుపల్లి, అరవింద్‌ కుమార్‌గౌడ్‌ వెళ్లిపోయారు.
« PREV
NEXT »

No comments

Post a Comment