తాజా వార్తలు

Wednesday, 18 October 2017

చంద్రబాబుని నిలదీసిన సుబ్బారెడ్డి!

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరినంత మాత్రాన వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్ పాదయాత్రపై ఈ పార్టీ ఫిరాయింపు ఎలాంటి ప్రభావం చూపబోదని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు.
పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అవినీతికి పాడి ఆవులా వాడుకుంటున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.పోలవరం ప్రాజెక్టుపై కొత్త ప్రతిపాదనలు చెప్పేందుకే చంద్రబాబు వెళ్లారని, కాంట్రాక్టర్‌తో కాకుండా చంద్రబాబే పనులు చేస్తున్నారని, కాంట్రాక్టర్లను అడ్డం పెట్టుకొని దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అసలు పనులను మెయిన్‌ కాంట్రాక్టర్‌ చేస్తున్నారా.. సబ్‌ కాంట్రాక్టర్‌ చేస్తున్నారా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌ పనితీరు నచ్చకపోతే మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని, పోలవరం ప్రాజెక్టుపై ఎంత ఖర్చు అవుతుందో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.అవినీతి రహితంగా ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రమంత్రి గడ్కరీనే అన్నారని, హడావుడిగా చంద్రబాబు ఎందుకు నాగ్‌పూర్‌ వెళ్లారని ప్రశ్నించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment