తాజా వార్తలు

Saturday, 21 October 2017

స్కూల్ విద్యార్థుల చేతిలో కాలేజీ పుస్తకాలు!

ఎల్బీనగర్‌లో గల ఓ కార్పొరేట్ పాఠశాల(నారాయణ టెక్నో స్కూల్)కు ఆ మండల విద్యాశాఖాధికారి యాధృచ్చికంగా ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. కాగా, ఆ పాఠశాలలోని తొమ్మిది, పదో తరగతి విద్యార్ధుల చేతుల్లో ఏకంగా ఇంటర్మీడియట్ పుస్తకాలు దర్శనమివడంతో ఎంఈవో ఆశ్చర్యానికి లోనయ్యారు.
వెంటనే ఆయన పాఠశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చేశారు. అయితే, ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సదరు పాఠశాలపై చర్యలు తీసుకునే అధికారం విద్యాశాఖాధికారులకు ఉన్నా… కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలనుఅధికారులు సైతం ఏమీచేయలేక పోతున్నారని వాపోతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment