తాజా వార్తలు

Wednesday, 25 October 2017

బుల్లెట్ రాణి సనా అనుమానాస్పద మృతి!

ఇంట‌ర్నేష‌న‌ల్ బుల్లెట్‌ రైడర్‌ సనా ఇక్బాల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైద‌రాబాద్ లోని నార్సింగి శివారులో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సనా చనిపోయింది. అయితే స‌నా మృతిపై కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. భ‌ర్తే స‌నాను హ‌త్య చేసి ఉంటార‌ని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న‌పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
సనా ఇక్బాల్ 2015లో ఒంటరిగా 38 వేల కిలోమీటర్ల క్రాస్ కంట్రీ రైడ్‌ను పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా వంద నగరాలను కవర్ చేస్తూ ఆమె ఈ రైడ్‌ను పూర్తిచేసింది. వెళ్లిన ప్రతీచోటా సెమినార్లు నిర్వహిస్తూ కుంగుబాటు, ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి యువతకు అవగాహన కల్పించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment