తాజా వార్తలు

Saturday, 21 October 2017

కెసిఆర్ ను కాంట్రాక్టులు అడుగుతా.. రాయపాటి

తెలంగాణలో ఎపి కి చెందిన వారు కాంట్రాక్టులు తీసుకుంటే తప్పేమిటని, గుంటూరు తెలుగుదేశం ఎమ్.పి రాయపాటి సాంబశివరావు ప్రశ్నించారు. ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు కు కెసిఆర్ ప్రభుత్వం నుంచి రెండువేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు దక్కాయన్న రేవంత్ రెడ్డి ఆరోపణను ప్రస్తావిస్తూ, ఎపి వారు ఇక్కడ కాంట్రాక్టులు చేస్తే నష్టం ఏమిటని అన్నారు. తాను కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి ఐదువేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు ఇవ్వాలని కోరతానని రాయపాటి చెప్పడం విశేషం. కెసిఆర్ తనకు మంచి మిత్రుడని కూడా ఆయన అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment