తాజా వార్తలు

Wednesday, 18 October 2017

రేవంత్ ఫిరాయింపు పై స్పందించిన లోకేష్

తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి పార్టీ మారుతారన్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌ స్పందించారు. పార్టీ మారుతారనే వార్తలు ఊహాగానాలు మాత్రమేనని లోకేష్‌ కొట్టిపారేశారు. పార్టీ మారతారని వస్తున్న వార్తలపై లోకేష్‌ వివరణ ఇచ్చారు. పార్టీ మారుతానని రేవంత్ ఎక్కడా చెప్పలేదన్నారు. కోర్టు పని మీద ఢిల్లీ వెళ్లానని రేవంత్ తనతో చెప్పారన్నారు. కంభంపాటి రామ్మోహన్‌రావు రేవంత్‌ను కలిసిన సంగతి తనకు తెలియదని ఆయన చెప్పారు.మీడియాలో చేసిన హడావుడికి తానెందుకు స్పందించాలని ప్రశ్నించారు.
కాగా తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రేవంత్‌రెడ్డి నిన్న పేర్కొన్న విషయం విదితమే. తాను ఓ కేసు విషయమై న్యాయవాదులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే విదేశీ పర్యటన కోసం ఢిల్లీలో విమానం ఎక్కేందుకు వచ్చిన చంద్రబాబును కలిసేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నించినా…. చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment