తాజా వార్తలు

Saturday, 21 October 2017

టాలీవుడ్ హీరోలపై తన వ్యాఖ్యలకు అనుపమ వివరణ

తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అభిమానులను కోరింది. తెలుగు ఇండస్ట్రీలో హీరో రోల్ గురించి తాను చేసిన కామెంట్లకు తాజాగా వివరణ ఇచ్చింది. తెలుగు సినిమాల్లో హీరో మినహాయించి మిగిలిన వారందరూ.. కేవలం సాధారణ పాత్రల వరకే పరిమితమని ఆమె ఇంతకు ముందు పేర్కొంది. అయితే.. సినిమాలో స్క్రిప్టే హీరో అని, నటీనటులందరూ కేవలం తమ పాత్రల వరకే పరిమితమని ఈ బ్యూటీ ఇప్పుడు వివరణ ఇచ్చింది.‘తెలుగులో చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం నన్ను సంప్రదిస్తున్నారు. ఇది నాకెంతో బాధ కలిగించేది. కానీ, కొన్ని సినిమాలు చేశాక అసలు విషయం అర్థమైంది. సినిమాలో స్క్రిప్టే హీరో.. మిగతావన్నీ అప్రస్తుతం’ అని అనుపమ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తాను చేస్తున్న పాత్రలతో సంతోషంగా ఉన్నట్టు ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.ఓ చిన్న కరెక్షన్ అంటూ అనుపమ తన ట్విట్టర్ అకౌంట్లో చేసిన పోస్టులో ఈ వివరణ ఇచ్చింది.
« PREV
NEXT »

No comments

Post a Comment