తాజా వార్తలు

Saturday, 21 October 2017

ట్విటర్ లో మోడీ కన్నా రాహుల్ ముందంజ!

సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ బాగా పుంజుకున్నారని కధనాలు వస్తున్నాయి. గత సెప్టెంబర్ వరకు ప్రధాని మోడీ ముందంజలో ఉండగా, తాజాగా రాహుల్ గాందీ ఆయనను అదిగమించారని ఆ కధనాలు వివరిస్తున్నాయి. రాహుల్ గాందీకి పది లక్షల మంది పాలోయర్స్ ట్విటర్ లో ఉన్నారట. కాగా రాహుల్ ఏదైనా ట్వీట్ చేస్తే, దానికి ప్రతి స్పందనగా రీట్విట్ చేస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరడం కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం వస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేస్తున్నా వ్యంగ్య విమర్శలకు ఆదరణ లబిస్తోందట. సగటున రాహుల్ కు 3800 రీట్వీట్స్ వస్తున్నాయట. మోడీ ఆలింగనం కోసం ట్రంప్ మళ్లీ ఎదురు చూస్తున్నారని రాహుల్ చేసిన ట్వీట్ కు అత్యదికంగా 19 వేలకు పైగా రీట్విట్ లు వచ్చాయట. గతంలో మోడీకి అత్యధికంగా ఇలాంటి రీట్వీట్ లు వచ్చేవి. ఒకప్పుడు కేజ్రీవాల్ కు ఇంత క్రేజ్ ఉండేది. ఆ తర్వాత మోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ లీడ్ లోకి వస్తున్నారు. దేశంలో రాజకీయ వాతావరణం మారుతోందా?
« PREV
NEXT »

No comments

Post a Comment