తాజా వార్తలు

Thursday, 19 October 2017

రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ స్పందన!

తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని వస్తున్న కథనాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. రేవంత్‌రెడ్డి పార్టీలో చేరే విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించారు. చేరికలపై తానేమీ మాట్లాడనని.. అంతా హైకమాండ్‌ చూసుకుంటుందని ఆయన అన్నారు.

టీ టీడీపీలో కీలక నేత అయిన రేవంత్‌ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న కథనాలు తెలుగు తమ్ముళ్లలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రులను టార్గెట్‌గా చేసుకొని రేవంత్‌ విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో రేవంత్‌ హస్తం గూటికి చేరుతారన్న కథనాలపై స్పందించాలని కోరగా.. ఉత్తమ్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment