తాజా వార్తలు

Thursday, 19 October 2017

సైనికులతో మోదీ దీపావళి సంబరాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దివాళి వేడుకలను భారత సైనికులతో కలిసి జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ప్రధాని దీపావళి వేడుకలను సైనికుల మధ్యనే జరుపుకుంటారు. దీపావళి రోజు మొత్తం సైనికులతోనే ఆయన గడుపుతారు. ఈ సారి జమ్ముకశ్మీర్‌లోని గురెజ్ వ్యాలీలో ఆయన పర్యటించారు. బందిపొర జిల్లాలోని ఎల్‌ఓసి ప్రాంతమే గురెజ్ వ్యాలీ. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఇతర సీనియర్ ఆర్మీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఇది వరకు 2014 దివాళిని ప్రధాని కశ్మీర్‌లోనే గడిపారు. మళ్లీ ఇప్పుడు 2017 దివాళికి రెండో సారి కశ్మీర్‌లో అడుగుపెట్టారు. 2015 లో పంజాబ్‌లోని ఇండియా – పాకిస్థాన్ బోర్డర్‌లో ప్రధాని దివాళి వేడుకలను జరుపుకున్నారు. 2016లో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న బోర్డర్ పోస్టుల్లో కాపలా కాసే జవాన్లతో మోదీ దివాళి వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ…ఈ సారి గురెజ్ వ్యాలీలో ఆర్మీ, బీఎస్‌ఎఫ్ జవాన్లతో దివాళి జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. జవాన్లతో సమయాన్ని గడపడం వల్ల తనకు ఎంతో ఎనర్జీ వస్తుందని మోదీ అన్నారు. ఒకరికొకరం స్వీట్లను తినిపించుకొని.. కాసేపు సరదాగా గడిపామని మోదీ తెలిపారు. జవాన్లు ప్రతి రోజు యోగ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని మోదీ వెల్లడించారు. ఎంతో పరాక్రమం, శౌర్యంతో మన దేశాన్ని జవాన్లు కాపాడుతారని… దేశాన్ని కాపాడటం కోసం తమను తాము త్యాగం చేసుకుంటూ ఎంతో అంకితభావంతో పని చేస్తారని మోదీ చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment